: గేల్ విఫలం...రాణించిన డివిలియర్స్, కోహ్లీ


ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరుకు ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ మూడో బంతికే బ్రేక్ ఇచ్చాడు. గేల్ ను పెవిలియన్ పంపాడు. అనంతరం కోహ్లీకి జతకలిసిన డివిలియర్స్ దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ క్రీజులో కుదురుకోవడంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులెత్తింది. 12వ ఓవర్లో బ్రాత్ వైట్ సంధించిన బంతిని బౌండరీ లైన్ వద్ద షమికి క్యాచ్ ఇచ్చిన డివిలియర్స్ (55) పెవిలియన్ చేరాడు. దీంతో కోహ్లీ (50)కి షేన్ వాట్సన్ (3) జత కలిశాడు. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు జట్టు రెండు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో జహీర్, బ్రాత్ వైట్ చెరో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News