: ప్రపంచ వ్యాప్తంగా ఒక్క నిమిషం పాటు ఇంటర్నెట్ ఆగిపోతే?...ఏం జరుగుతుందో తెలుసా?


ఇంట్లో కూర్చుని ప్రపంచాన్ని చూసేస్తున్నాం. ఇంట్లో నుంచే షాపింగ్, వ్యాపారం, వైద్యం, ఇతర పనులన్నీ చక్కబెట్టేస్తున్నాం. అయితే ఇలాంటి సమయంలో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం మీద ఇంటర్నెట్ ఆగిపోతే... ఏం జరుగుతుంది? దీనిపైనే, ఒక్క నిమిషం పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ స్తంభిస్తే ఏం జరుగుతుందని ఇంటర్నెట్ వరల్డ్ స్టాట్స్ సంస్థ లెక్కగట్టింది. దాని ప్రకారం, గూగుల్ లో 24 లక్షల అన్వేషణలు నిలిచిపోతాయి. యూట్యూబ్ లో 28 లక్షల వీక్షణలు, 300 గంటల వీడియోల అప్ లోడింగ్ నిలిచిపోతుంది. వాట్స్ యాప్ మాధ్యమంగా వెళ్లాల్సిన 2.08 కోట్ల మెసేజ్ లు ఆగుతాయి. ఫేస్ బుక్ లో 7,01,389 లాగిన్ లు ఆగిపోతాయి. ట్విట్టర్ లో 3,47,222 ట్వీట్లు ఆగిపోతాయి. 38,194 పోస్టులు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు కాకుండా నిలిచిపోతాయి. సుమారు 15 కోట్ల ఈ మెయిల్స్ ఆగిపోతాయి. స్నాప్ చాట్ ద్వారా షేర్ కావాల్సిన 5,27,760 ఫోటోలు నిలిచిపోతాయి. స్కైప్ ద్వారా చేసుకునే 1,10,040 వీడియో కాల్స్ ఆగిపోతాయి. యాపిల్ స్టోర్స్ నుంచి 51 వేల యాప్స్ డౌన్ లోడ్ కాకుండా ఉండిపోతాయి. డేటింగ్ వెబ్ సైట్లలో 9.72 లక్షల స్వైప్ ఆగిపోతాయి. క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ కు 1389 బుకింగ్స్ నిలిచిపోతాయి. అమెజాన్ నుంచి కోటీ 40 లక్షల రూపాయల కొనుగోళ్లు నిలిచిపోతాయి. లింక్డ్ ఇన్ నుంచి 120 కొత్త ఖాతాల చేరికలు ఆగిపోతాయి. ఒక్క నిమిషం ఇంటర్నెట్ ఆగిపోతే ఇంత జరుగుతుందన్నమాట!

  • Loading...

More Telugu News