: కొత్త ప్రాజెక్టులను ఆకర్షించడంలో నెంబర్ వన్ మహారాష్ట్ర
కొత్త ప్రాజెక్టులను ఆకర్షించడంలో మహారాష్ట్ర నెంబర్ వన్ గా నిలిచింది. మార్చి నెలలో ఈ రాష్ట్రానికి 96,889 కోట్ల రూపాయల విలువైన అంచనాలతో ప్రాజెక్టులు వచ్చాయని సెంటర్ ఫర్ ఇండియన్ మానెటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపింది. దేశ వ్యాప్తంగా మార్చిలో మొత్తం 3.18 లక్షల కోట్ల రూపాయలతో పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రాగా, అందులో మహారాష్ట్ర వాటాయే అధికమని సీఎంఐఈ తెలిపింది. గత మూడు నెలల్లో కొత్త ప్రాజెక్టులను చూస్తే మహారాష్ట్రకు 30 శాతం పెట్టుబడులు దక్కగా, 20 శాతం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షించగలిగిందని సీఎంఐఈ తెలిపింది. కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు ప్రకటనలు బాగానే ఉన్నప్పటికీ, గతంలో ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని సీఎంఐఈ పేర్కొంది.