: ఎందుకండీ డొంకతిరుగుడు ప్రశ్నలు...అది నిజమే!: షాహిద్ కపూర్
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. 'ఉడ్తా పంజాబ్' ట్రైలర్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 'ఏంటి, షాహిద్ ఉత్సాహంగా, సంతోషంగా కనబడుతున్నావు?' అంటూ జర్నలిస్టులు ప్రశ్నించారు. దీనికి స్పందించిన షాహిద్ కపూర్ 'ఎందుకండీ, ఈ డొంకతిరుగుడు ప్రశ్నలు? మీరు విన్నది నిజమే...అవును నేను త్వరలో తండ్రిని కాబోతున్నాను. ప్రస్తుతానికి అదే ఆనందంలో ఉన్నాను' అని స్పష్టం చేశాడు. 'ఉడ్తా పంజాబ్'లో షాహిద్ సరసన అలియా భట్, కరీనా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.