: రాణించిన డుప్లెసిస్, స్మిత్...పంజాబ్ విజయ లక్ష్యం 153 పరుగులు
ఐపీఎల్ సీజన్ 9 లో భాగంగా మొహాలీ వేదికగా రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆదిలోనే ఓపెనర్ రహానే (9) పెవిలియన్ చేరాడు. అనంతరం కుదురుకున్నట్టు కనిపించిన పీటర్సన్ (15) కూడా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ (67) ఆకట్టుకున్నాడు. పెరీరా (8) విఫలం కాగా, స్మిత్ (38) కుదురుకున్నాడు. ధోనీ (1) నిరాశపర్చగా, ఇర్ఫాన్ పఠాన్ (2) రన్ అవుట్ గా వెనుదిరిగాడు. దీంతో రెయిజింగ్ పూణే జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లతో రాణించగా, అతనికి సందీప్ శర్మ రెండు వికెట్లు, అబాట్ ఒక వికెట్ తీసి సహకారమందించారు. దీంతో 153 పరుగుల విజయ లక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెన్లు మురళీ విజయ్ (20), వోహ్రా (6) ఆకట్టుకుంటున్నారు.