: బాల్య వివాహాలను ఆపేందుకు ఎంపీ పోలీస్ సరికొత్త ప్లాన్!
బాల్యవివాహాలను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు వినూత్న ప్రణాళికను అమలు చేస్తున్నారు. మండ్ సౌర్ జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో వాటిని ఎలాగైనా అరికట్టాలని అక్కడి పోలీసు బాసులు ఆలోచించారు. బాల్య వివాహాల గురించి స్థానికులకు బాగా తెలుస్తుందని, వారిలో అవగాహన కల్పిస్తే బాల్యవివాహాలకు చెక్ చెప్పొచ్చని భావించారు. దీంతో, మండ్ సౌర్ జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా బాల్య వివాహాలు చేసుకుంటున్నట్టు తెలిస్తే...తమకు సమాచారం ఇవ్వాలని, అలా సమాచారం ఇచ్చిన వారికి వంద రూపాయల మొబైల్ రీఛార్జ్ చేస్తామని తెలిపారు. ఇందుకోసం కొన్ని ఫోన్ నెంబర్లను ప్రజలకు సూచించారు. దీనికి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయమని, కలెక్టర్ జేబులో డబ్బులు ఖర్చు చేస్తారని వారు వెల్లడించారు.