: రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్


శ్రీలంక క్రికెటర్ రంగన హెరాత్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ టీ20, వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు రంగన ప్రకటించాడు. టెస్టుల నుంచి మాత్రం ఇంకా విరామం తీసుకోలేదని, టెస్టుల్లో ఆడే సత్తా ఇంకా ఉందని తెలిపాడు. గాయాలతో సావాసం చేస్తున్న కారణంగా వన్డేలు, టీ20ల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్టు చెప్పాడు. కాగా, ముత్తయ్య మురళీధరన్ రిటైర్మెంట్ తరువాత స్పిన్నర్, అక్కరకొచ్చే బ్యాట్స్ మన్ గా శ్రీలంక జట్టులో హెరాత్ కీలక పాత్ర పోషించాడు. గత కొంత కాలంగా విఫలమవుతుండడం, గాయాల బారిన పడడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు.

  • Loading...

More Telugu News