: గుజరాత్ లో మళ్లీ ఉద్రిక్తత...జాట్ తరహా ఆందోళన


గుజరాత్ మళ్లీ రాజుకుంది. మరోసారి పటేల్ రిజర్వేషన్ ఉద్యమం మళ్లీ మొదలైంది. మెహసానా పట్టణంలో వందలాదిగా పటేళ్లు రోడ్డెక్కారు. తమ నేత హార్డిక్ పటేల్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పలువురిపై దాడులకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. జాట్ ల తరహా ఆందోళన చేపడతామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News