: బ్రిటన్ దంపతులకు రాయి రూపంలో తగిలిన అదృష్టం!
బ్రిటన్ కు చెందిన గ్యారీ, ఏంజెలా విలియమ్స్ అనే దంపతులు మిడిల్టన్ బీచ్ లో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో సువాసనలు వెదజల్లుతున్న పెద్ద రాయి కనిపించింది. దానిని పట్టుకుని చూస్తే అది సువాసనలు వెదజల్లుతోంది. ఇది చుట్టుపక్కల వారికి చూపించడంతో వారు ఇది విలువైన రాయి అని చెప్పారు. సముద్రంలో వేల్స్ అనే పెద్ద తిమింగలాలు ఉంటాయి. ఈ చేపలు భోజనం చేసిన తరువాత వాటి జీర్ణక్రియల్లో జరిగే రసాయన ప్రక్రియల వల్ల మృదువైన పదార్థం ఏర్పడుతుంది. అజీర్తి కారణంగా ఒక్కోసారి అవి వాంతులు చేసుకుంటాయి. ఇలా వాంతులు చేసుకున్నప్పుడు ఆ మృదువైన పదార్థం నీటిపై తేలి ఒడ్డుకు కొట్టుకువస్తుంది. తీరప్రాంతానికి చేరి, రాయిలా సువాసనలు వెదజల్లుతుంది. దీనిని అంబరు అంటారు. ఈ వేల్ వామిట్ ను పరిమళద్రవ్యాలలో వాడతారు. అందువల్ల దీనికి భలే గిరాకీ ఉంటుంది. అయితే దీనిని గుర్తించడం అంత తేలిక కాదని, ఒక వేళ ఆ దంపతులకు దొరికింది వేల్ వామిట్ అయితే మాత్రం దాని విలువ 46,65,565.59 రూపాయలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.