: శాండియాగో పోలీసులకు సవాల్ గా మారిన యువతి


కాలిఫోర్నియాలోని శాండియాగో పట్టణంలో ఓ యువతి హల్ చల్ చేసి పోలీసులకు పని చెప్పింది. గత రాత్రి ఓ యువతి టాప్ లెస్ రేంజ్ రోవర్ కారులో టైటానిక్ సినిమాలో హీరోహీరోయిన్లు ఓడ చివర్లో నిలబడ్డ రీతిలో పోజిస్తూ నిలబడి, ఆ త్రోవన వెళ్లేవారందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు, అలా నిలబడి ఒంటిపైనున్న దుస్తులను ఒక్కోటి విప్పేసింది. వీధుల్లో బట్టలన్నీ విప్పేసి అరుస్తూ ఓ యువతి విహరించడం తమ దృష్టికి వచ్చిందని దర్యాప్తు అధికారి తెలిపారు. ఆమె ఎవరు? అన్న విషయాన్ని ఆరా తీస్తున్నామని వారు చెప్పారు. అయితే ఆమెను కాసాబ్లాంకా క్లబ్ లో డాన్స్ చేసే యువతిగా అనుమానిస్తున్నామని వారు పేర్కొన్నారు. దీనిని ప్రత్యక్షంగా చూసిన వారు, ఆమెతో ఎవరో ఒప్పందం చేసుకుని, అలా విహరింపజేశారని, ఆమె అలా తిరుగుతున్నప్పుడు షూట్ చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. పోలీసులు మాత్రం ఆమె కోసం గాలిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News