: జలాల్ పూర్ లో దారుణం...ఒంటరి మహిళపై దాడి


నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న ఓ మహిళపై మాజీ భర్త, అతని బంధువులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బాధితురాలు ఒంటరిగా ఉండడం చూసిన మాజీ భర్త, అతని సోదరుడు, అతని తండ్రి, తోడి కోడలు కలసి ఆమెను కాళ్లు, చేతులు బంధించి బయటకి చెప్పుకోలేని చోట్ల దాడి చేసి, అలాగే మురుగు కాల్వలో పడేశారు. రాత్రంతా మురుగు కాల్వలో ఆమె నరకయాతన అనుభవించగా, తెల్లవారు జామున ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, ఆసుపత్రిలో చేర్చారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, బాధితురాలి మాజీ భర్తకు నాలుగు వివాహాలు జరిగినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News