: టీడీపీలో మగాళ్లు లేరు...అందుకే వైసీపీ నేతలను చేర్చుకుంటున్నారు!: రోజా


తెలుగుదేశం పార్టీలో మగాళ్లు లేరని వైఎస్సార్సీపీ నేత రోజా తెలిపారు. విశాఖపట్టణంలో 'రైల్వే జోన్ విశాఖ హక్కు' అంటూ చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టీడీపీలో మగాళ్లు లేక వైఎస్సార్సీపీకి చెందిన నేతలను ఆ పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే, ఆయనే కనక రాయలసీమ బిడ్డ అయితే తక్షణం వారందర్నీ పదవులకు రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. టీడీపీ ప్రభుత్వం తప్పుడు విధానాలు అవలంబిస్తూ పాలనసాగిస్తోందని ఆమె అన్నారు. విభజన చట్టంలో రైల్వే జోన్ విశాఖకు వస్తుందని పేర్కొన్నారని, ఓటుకు నోటు కుంభకోణం బయటకు తీస్తారనే భయంతో చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టుపెడుతున్నారని ఆమె విమర్శించారు.

  • Loading...

More Telugu News