: ఈక్వెడార్ లో విలయం... రోదనలతో దద్దరిల్లుతున్న ఆసుపత్రులు


ఈక్వెడార్ ను కుదిపేసిన భూకంపం తాలూకు వార్తలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకూ 77 మంది మరణించినట్టు అధికారులు ధ్రువీకరించారు. మొత్తం 600 మందికి పైగా గాయపడి ఆసుపత్రుల్లో చేరారు. వీరి రోదనలతో ఆసుపత్రులు మారుమోగుతున్నాయి. సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో మృతుల సంఖ్య వందల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని క్విటోలో పలు భవనాలు కుప్పకూలినట్టు, సామాజిక మాధ్యమాల్లో చిత్రాలు పోస్ట్ అవుతున్నాయి. పలు చోట్ల వంతెనలు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భూకంప ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలకు సైన్యం హెలికాప్టర్లలో చేరుకుంటోంది. ప్రస్తుతానికి ఈక్వెడార్, కొలంబియా తీరాల్లో సునామీ హెచ్చరికలను ఇంకా ఉపసంహరించలేదని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News