: ముందుగానే ఏపీ ఇంటర్ ఫలితాలు: గంటా
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షా ఫలితాలను ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ ప్రకటించారు. తిరుపతిలోని యస్వీ యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఇంకుడు గుంత తవ్వకాన్ని ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ విద్యాసంస్థలు, పత్రికలు విద్యార్థులకు నమూనా ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తుండటాన్ని ఆయన అభినందించారు. వీటివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని, భయం, అపోహలు తొలగి మరింత సులువుగా పరీక్షలకు హాజరవుతారని ఆయన అన్నారు.