: ఈక్వెడార్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక
ఈక్వెడార్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో ప్రకంపనలు రాగా, పసిఫిక్ మహా సముద్రంలో సునామీ రావచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. రాజధాని క్వీటోకు 173 కిలోమీటర్ల దూరంలో అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం 11:58కి భూకంపం వచ్చింది. 11 నిమిషాల వ్యవధిలో మరో ప్రకంపన 4.8 తీవ్రతతో నమోదైంది. క్వీటాలో పలు భవనాలు కుప్పకూలాయి. ఇప్పటికిప్పుడు ఎంతమంది మరణించారో వెల్లడించలేమని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లోని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.