: విజయవాడలో అంతర్జాతీయ ముఠా అరెస్ట్... భారీఎత్తున దొంగనోట్లు స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి దొంగనోట్లను తరలిస్తున్న అంతర్జాతీయ ముఠా ఒకటి విజయవాడ సమీపంలో పట్టుబడింది. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా దొంగనోట్లు ఏపీకి వస్తున్నాయన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేయగా, పలు రాష్ట్రాలకు చెందిన 13 మంది యువకులు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ. 8 లక్షల విలువైన దొంగనోట్లు, రూ. 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 3 ద్విచక్రవాహనాలు, 16 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో కొందరు గతంలోనూ ఇదే తరహా కేసుల్లో పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. వీరిని రిమాండ్ చేసి, వీరి వెనుక ఎవరున్నారన్న విషయమై కేసును దర్యాఫ్తు చేయనున్నట్టు వివరించారు.