: శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈవోగా కోదండ రామారావు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో డిప్యూటీ ఈవో స్థాయి అధికారుల బదిలీలు జరిగాయి. వాటి వివరాలు... శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈవోగా కోదండ రామారావును నియమించారు. ప్రస్తుతం డిప్యూటీ ఈవోగా పని చేస్తున్న చిన్నంగారి రమణను తిరుచానూరు అమ్మవారి ఆలయానికి బదిలీ చేశారు. అన్నదానం డిప్యూటీ ఈవోగా వేణుగోపాల్ కు మార్కెటింగ్ విభాగం అదనపు బాధ్యతలు అప్పగించారు. రిసెప్షన్-2 డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ కు అదనంగా రిసెప్షన్-1 బాధ్యతలను అప్పగించారు. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో పని చేసిన చెంచు లక్ష్మికి చెన్నైలోని శ్రీవారి ఆలయ బాధ్యతలు అప్పగించారు.