: పంట నష్టానికి పరిహారంగా రూ.81 చెక్కును రైతు చేతిలో పెట్టిన ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం
ఛత్తీస్ గఢ్‌లో పంట నష్టపోయిన తనకు ప్రభుత్వం పంపిన పరిహారం చూసి ఓ రైతు ఆశ్చర్యపోయాడు. ఆ డబ్బుతో అప్పెలా తీర్చాలంటూ ఆవేదన చెందుతున్నాడు. రాయిపూర్‌లోని సర్గుజా ప్రాంతానికి చెందిన పంట నష్టపోయిన జైరామ్‌కు ప్రభుత్వం నష్టపరిహారంగా 81 రూపాయల చెక్కు పంపించింది. ఆ చెక్కును చూసి కంగుతిన్న జైరామ్ ఈ డబ్బుతో తాను తీసుకున్న లోనును తీర్చాలా..? లేక బలవన్మరణానికి పాల్పడాలా..? అంటూ ప్రశ్నిస్తున్నాడు. జైరామ్‌కు ఎదురైన ఘటనలు గతంలోనూ పలు సందర్భాల్లో పలువురు రైతులకు ఎదురయ్యాయి.