: మరో రెండు వికెట్లు పడగొట్టిన కోల్ కతా రైడర్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్ లో 5.6, 9.4 ఓవర్ల వద్ద మోజెస్ హెన్రిక్, దీపక్ హుడాల వికెట్లను వరుసగా ఉమేష్, రస్సెల్ తీసుకున్నారు. మోజెస్ (6) ఎల్బీడబ్ల్యు అవుట్ కాగా, ఉమేష్ కు క్యాచ్ ఇచ్చి దీపక్ హుడా (6) అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు నష్టపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 105 పరుగులు చేసింది. మోర్గాన్, నామన్ ఓఝాల భాగస్వామ్యం ప్రస్తుతం కొనసాగుతోంది.