: అమెరికా అధ్యక్షుడి ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలు వెల్లడి.. ఉపాధ్యక్షుడి కన్నా తక్కువే!
అమెరికా అధ్యక్షుడి ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలను వైట్ హౌస్ తాజాగా వెల్లడించింది. అయితే దీనిలో ఆ దేశ ఉపాధ్యక్షుడికన్నా అధ్యక్షుడు ఒబామా పన్ను తక్కువగా చెల్లించినట్లు పేర్కొంది. ఆ దేశ ఉపాధ్యక్షుడు జో బిడెన్, ఆయన సతీమణి జిల్ ఆదాయం ఒబామా దంపతుల ఆదాయం కన్నా తక్కువగానే ఉన్నా.. అమెరికా ఉపాధ్యక్షుడే పన్ను ఎక్కువగా చెల్లించినట్లు తెలిపింది. గత ఏడాది అమెరికా అధ్యక్షుడి ఆదాయం 4,36,000 డాలర్లు. అయితే పన్నుగా ఆయన సుమారు 81 వేల డాలర్లను చెల్లించారు. కాగా, పలు సంస్థలకు ఒబామా తన ఆదాయంలో 15 శాతాన్ని విరాళంగా ఇచ్చినట్లు వైట్ హౌస్ పేర్కొంది.