: రైలుకి ఎదురుగా వెళ్లి సెల్ఫీ ప్రయత్నం.. ఇద్దరు మృతి!
సెల్ఫీ మోజుకు మరో ఇద్దరు వ్యక్తులు బలైపోయారు. రైలుకి ఎదురుగా వెళ్లి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన ఈరోజు వెలుగులోకొచ్చింది. నిన్న ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో పట్టాలపై వేగంగా దూసుకొస్తున్న రైలుకి కొద్ది దూరంలో నించొని ఇద్దరు వ్యక్తులు సెల్ఫీకి ప్రయత్నించారు. రైలు దగ్గరకు రాగానే దూరంగా వెళ్లిపోవచ్చనుకుని భావించి, వారు ఈ సాహసానికి ఒడిగట్టారు. చివరికి రైలు ఢీ కొనడంతో ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.