: ఈ సారి బీఎండబ్ల్యూ వంతు!... నోయిడాలో నలుగురు పాదచారులపైకి దూసుకెళ్లిన కారు


మొన్నటికి మొన్న మెర్సిడెజ్ బెంజ్ కారుతో వీధుల్లోకి వచ్చిన ఓ మైనర్ బాలుడు తన కారును వేగంగా నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైన ఈ ప్రమాద దృశ్యాలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. తాజాగా ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో మరో హిట్ అండ్ రన్ ఘటన నమోదైంది. బీఎండబ్ల్యూ కారుతో వేగంగా దూసుకువచ్చిన ఓ వ్యక్తి తన కారుతో నలుగురు పాదచారులను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే అతడు అక్కడే తన కారును వదిలి పరారయ్యాడు. ఈ ఘటనలో గాయపడ్డ నలుగురు వ్యక్తులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన కారు ఎవరిదన్న వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News