: సుజనా కుమారుడికి రూ.1,000 జరిమానా!... కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
అర్ధరాత్రి వేళ నగరం నడి బొడ్డున అత్యాధునిక స్పోర్ట్స్ కారులో షికారు చేసిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి కుమారుడు సాయి కార్తీక్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కారును సీజ్ చేసి కార్తీక్ ను అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి విధించే శిక్ష మాదిరే సుజనా కుమారుడికి కూడా రూ.1,000 జరిమానాను విధించామని హైదరాబాదు ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ చెప్పారు. అంతేకాక ర్యాష్ డ్రైవింగ్ తో జరిగే నష్టాలను వివరిస్తూ కార్తీక్ కు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపేశామని ఆయన తెలిపారు. కార్తీక్ తో పాటు పట్టుబడ్డ అతడి స్నేహితులకు కూడా ఇదే తరహా శిక్షలను అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.