: వైసీపీ ‘తూర్పు’ అధ్యక్షుడిగా కన్నబాబు నియామకం


వైసీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నియమితులయ్యారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం పార్టీ అధిష్ఠానం ఓ ప్రకటనను విడుదల చేసింది. వైసీఎల్పీ ఉపనేత హోదాతో పాటు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూ పార్టీకి రాజీనామా చేయడంతో పార్టీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. జ్యోతుల నెహ్రూ పార్టీ వీడుతున్నట్లు సమాచారం అందిన వెంటనే పార్టీ నేతలతో చర్చలు జరిపిన జగన్... జ్యోతుల స్థానంలో పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కన్నబాబు పేరును ఖరారు చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ప్రసన్నకుమార్ ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం మరో నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News