: చంద్రబాబు మంత్రదండం కేసీఆర్ చేతిలో ఉంది: ఏపీసీసీ చీఫ్ రఘువీరా ధ్వజం


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిసేపటి క్రితం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా రఘువీరా... పోలవరం ముంపు మండలాల నుంచి ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు బదలాయిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించారు. టీడీఎల్పీలో మాటమాత్రంగానైనా చర్చ లేకుండానే ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు ఎలా బదలాయిస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలా నడవమంటే చంద్రబాబు అలా నడుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మంత్రదండం కేసీఆర్ చేతిలో ఉందని రఘువీరా అన్నారు. ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి బదలాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News