: కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని రెండుసార్లు వ్యతిరేకించా: కేంద్ర మాజీ మంత్రి హెచ్.ఆర్. భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని రెండు సార్లు వ్యతిరేకించానని కేంద్ర మాజీ న్యాయశాఖా మంత్రి హన్స్ రాజ్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల విషయంలో పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించారని అన్నారు. 2007లో ములాయం ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలతో రద్దు చేయాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించిందని, దానిని కూడా తాను వ్యతిరేకించానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.