: చంద్రబాబు డబ్బు లావాదేవీలు నిర్వహించేందుకే నారాయణ సింగపూర్ పర్యటన: శైలజానాథ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ సంపాదన లావాదేవీలు నిర్వహించేందుకే మంత్రి నారాయణ సింగపూర్ పర్యటనకు వెళుతున్నారని కాంగ్రెస్ నేత శైలజానాథ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం టీడీపీ నేతలకు లాభం చేకూర్చేందుకేనని ఆయన ఆరోపించారు. అవినీతికి పాల్పడిన మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు సొంత భూముల్లో దొరికిన ఎర్రచందనం దుంగలపై విచారణ జరిపించాలని ఆయన సూచించారు. చంద్రబాబు ప్రభుత్వ పనితీరు బాగోలేదని సర్వేలే చెబుతున్నాయని ఆయన విమర్శించారు.