: ఉగ్రవాదులు సమావేశమైన వేళ విమానం దాడి... 40 మంది హతం
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ప్రత్యేకంగా సమావేశమయ్యారని తెలుసుకున్న ఆఫ్గనిస్థాన్ సైన్యం జరిపిన యుద్ధ విమాన దాడిలో 40 మంది హతమయ్యారు. రహస్యంగా సమావేశం జరుగుతోందని తెలుసుకున్న తమ సైన్యం వారిని చావుదెబ్బ తీసిందని ఆఫ్గన్ రక్షణ శాఖ ప్రతినిధి జనరల్ దాలత్ వజిరి వెల్లడించారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగిందని, అచిన్ జిల్లా పిఖాలాతాబాండ్ ప్రాంతంలో వీరు మీటింగ్ పెట్టుకోగా, చాకచక్యంగా వైమానిక దాడులు నిర్వహించామని తెలిపారు. మరణించిన వారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చి ఉగ్రవాదుల్లో చేరిన వారేనని పేర్కొన్నారు. కొన్ని మృతదేహాలను స్థానికులు గుర్తు పట్టి తీసుకెళ్లారని తెలిపారు.