: పోలీసుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం...రామాలయంలో బాంబులు


పోలీసులు అప్రమత్తం కాకపోయి ఉంటే శ్రీరామ నవమి ఉత్సవాలు పెను విషాదాన్ని మిగిల్చి ఉండేవి. వివరాల్లోకి వెళ్తే...ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లా సున్నంగూడలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు భక్తులు పోటెత్తుతారు. ఈ విషయం తెలిసిన సంఘవిద్రోహ శక్తులు రామాలయంలో బాంబులు పెట్టారు. వీటి గురించి పోలీసులకు సమాచారం అందడంతో వాటిని గుర్తించిన పోలీసులు, వాటిని నిర్వీర్యం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ బాంబులు మావోయిస్టులు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, పోలీసులను శత్రువులుగా భావించే మావోయిస్టులు ప్రజలను హతమార్చే దుస్సాహసం చేసే అవకాశం ఉందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

  • Loading...

More Telugu News