: ఆ కంపెనీ నుంచి వైదొలగమని కర్ణాటక సీఎం కుమారుడికి సూచించా: డిగ్గీరాజా


గత కొంత కాలంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను నెలకొల్పే కాంట్రాక్టులను, ముఖ్యమంత్రి తనయుడు డాక్టర్ యతీంద్ర డైరెక్టర్ గా ఉన్న మ్యాట్రిక్స్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారంటూ గత కొన్ని రోజులుగా వివాదం రాజుకుంటోంది. ఈ వివాదానికి ముగింపు పలకాలని భావించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సీఎంకు ఓ సూచన చేశానని అన్నారు. కాంట్రాక్టులు కేటాయించే విషయం పూర్తి పారదర్శకంగా జరిగిందని ఆయన చెప్పారు. అసలా ఫైలు ముఖ్యమంత్రి వద్దకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదానికి ముగింపు పలకాలంటే ఆ కంపెనీ నుంచి యతీంద్ర వైదొలిగితే సరిపోతుందని సలహా ఇచ్చానని ఆయన అన్నారు. తాను ఇచ్చింది సలహా మాత్రమేనని, ఆదేశం కాదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News