: భద్రాచలానికి రూ. 100 కోట్లు కేటాయించిన కేసీఆర్


భద్రాచలంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 100 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈ ఉదయం సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, భద్రాచలాన్ని మరింతగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. దేవాలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధి, తొలగించే గృహాలకు పరిహారం, భక్తులకు మరిన్ని వసతిగృహాలు తదితరాలకు ఈ నిధులను వెచ్చిస్తారని కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ ధూపదీప నైవేధ్యాలకు లోటు రానీయకుండా చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News