: సింగపూర్ టౌన్ షిప్ లో టెక్కీ సూసైడ్... పదో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య


శ్రీరామనవమి పర్వదినాన హైదరాబాదు శివారులోని సింగపూర్ టౌన్ షిప్ లో విషాదం చోటుచేసుకుంది. జెన్ ప్యాక్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు అక్కడి ఓ అపార్ట్ మెంటులోని పదో అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడ పండుగ సంబరాన్ని ఆవిరి చేసింది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్న టెక్కీని పరిశీలించారు. చనిపోయిన యువ టెక్కీ వయసు 30 ఏళ్లు ఉంటుందని, అయితే అతడి పేరు కాని, ఇతర వివరాలు కాని తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News