: అమెరికాను తాకగల మిసైల్ పరీక్షలో విఫలమైన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా వ్యవస్థాపక నేత కిమ్ 2-సుంగ్ జన్మదిన వేడుకలు వైభవంగా జరుగుతున్న వేళ, మిలటరీ చేపట్టిన మిసైల్ పరీక్ష విఫలమైంది. అమెరికన్ సైనిక క్షేత్రాలను తాకగల ఖండాంతర క్షిపణి 'ముసుదన్' క్షిపణిని ప్రయోగించగా, అది లక్ష్యాన్ని తాకలేకపోయిందని దక్షిణ కొరియా సైనిక వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం ఈ పరీక్ష జరిగిందని, ఆపై కిమ్ జాంగ్, సైనికాధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారని 'యోహ్నాప్' న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. ప్రస్తుత అధినేత కిమ్ జాంగ్ ఉన్ కు కిమ్ 2-సుంగ్ తాతయ్య. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా పలు దఫాలుగా సైనిక పాటవ పరీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అమెరికాను హెచ్చరిస్తూ, గ్రాఫిక్స్ తో కూడిన వీడియోలు సైతం తీసి విడుదల చేసింది. తమ వద్ద 2,500 నుంచి 4 వేల కిలోమీటర్ల దూరం అణుబాంబులను తీసుకెళ్లగల క్షిపణులు ఉన్నాయని ప్రకటించిన ఉత్తర కొరియా, అమెరికన్ నగరాలను నేలమట్టం చేయగలమన్న నమ్మకంతో ఉంది. ఉత్తరకొరియా నేత దూకుడును ప్రపంచదేశాలు ఆక్షేపిస్తున్నాయి.