: కోడెల ఇలాకాలో బాంబుల మోత!... టీడీపీ కార్యకర్త ఇంటిలో పేలిన బాంబులు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సొంతూరుగా ప్రసిద్ధికెక్కిన గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేటి ఉదయం బాంబుల మోత మోగింది. నరసరావుపేట మండలం పమిడిపాడులో అధికార టీడీపీ కార్యకర్త ఎద్దు వెంకటేశ్వర్లు ఇంటిలో నేటి ఉదయం బాంబులు పేలాయి. ఉన్నట్టుండి బాంబులు పేలడంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెనువెంటనే తేరుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాంబు పేలుళ్లకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఏ ఒక్కరికీ గాయాలు కాలేదు.