: కన్నయ్య కుమార్ కు మరింత పోలీసు భద్రత, ఉమర్ ఖలీద్ కు కూడా


జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ కు మరింత పోలీసు భద్రతను కల్పించాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. ఆయనతో పాటు దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ కు కూడా భద్రతను పెంచనుంది. నిన్న మహారాష్ట్రలో కన్నయ్య, ఉమర్ లు ర్యాలీ నిర్వహించగా, కొందరు నిరసనకారులు చెప్పులు, బూట్లతో దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కన్నయ్య పర్యటనలను బీజేపీ, భజరంగదళ్ కార్యకర్తలు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే

  • Loading...

More Telugu News