: జపాన్ లో భూకంప విలయం... 9 మంది మృతి, వందల మందికి గాయాలు


జపాన్ లో నేటి ఉదయం పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం ఆ దేశంలో భారీ నష్టాన్ని మిగిల్చింది. జపాన్ లోని కుషూలో సంభవించిన ఈ భూకంపం దాటికి 9 మంది మృత్యువాత పడ్డారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలు రహదారులపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఇళ్ల శిథిలాల కింద పెద్ద సంఖ్యలో జనం చిక్కుకున్నట్లు సమాచారం. భూకంపం సంభవించిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు భూకంపం కారణంగా 761 మంది గాయపడగా, వారిలో 44 మంది పరిస్థితి విషమంగా ఉంది. భూకంపం కారణంగా సంభవించిన నష్టం అపారంగా ఉందని విపత్తు శాఖ తెలిపింది. భూకంపంపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన ప్రధాని షింజో అబే... సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News