: విదేశాల నుంచి ఇండియాకు కుప్పలు తెప్పలుగా డబ్బు!


విదేశాల్లో ఉండే ప్రవాసులు, తమ స్వదేశాలకు డబ్బులు పంపుతుంటారన్న సంగతి తెలిసిందే. ఇక 2015లో ప్రవాసులు అత్యధికంగా డబ్బు పంపిన దేశం ఇండియానేనట. ప్రపంచబ్యాంకు తాజా గణాంకాల ప్రకారం 2015లో విదేశాల నుంచి మొత్తం 69 బిలియన్ డాలర్లు (సుమారు 4.5 లక్షల కోట్లు) రెమిటెన్స్ గా వచ్చిందట. రెండో స్థానంలో నిలిచిన చైనాకు వివిధ దేశాల నుంచి 64 బిలియన్ డాలర్లు వచ్చాయని వరల్డ్ బ్యాంక్ రిపోర్టు తెలిపింది. మూడు, నాలుగు స్థానాల్లో ఫిలిప్పీన్స్ (28 బిలియన్ డాలర్లు), మెక్సికో (25 బిలియన్ డాలర్లు) నిలిచాయి. కాగా, 2014లో ఇండియాకు వచ్చిన 70 మిలియన్ డాలర్లతో పోలిస్తే గత సంవత్సరం రెమిటెన్స్ తగ్గినప్పటికీ, ఇండియా తొలి స్థానంలోనే నిలిచింది. 2009 తరువాత ఇండియాకు ప్రవాసులు పంపే డబ్బు తగ్గడం ఇదే తొలిసారిగా ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

  • Loading...

More Telugu News