: చిరంజీవిగారిలా కనిపించడం కాదు...ఆయనంత ఎత్తుకి ఎదగాలి: నాని


తన 'అలా మొదలైంది' సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే తాగుబోతు రమేష్ ట్రాక్ ను రాసింది ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి అని యువనటుడు నాని తెలిపాడు. 'సుప్రీం' ఆడియో వేడుకలో పాల్గొన్న సందర్భంగా నాని మాట్లాడుతూ, తాను సుమకు మంచి అభిమానినని అన్నాడు. 'సుమ యాంకరింగ్ చూసి దర్శకుడు టెన్షన్ ఫీలవుతున్నాడు. ఇన్ని పంచ్ లు సినిమాలో వేయగలనో లేదో అని టెన్షన్' అంటూ నాని చెప్పాడు. తన కెరీర్ మొదలైన దగ్గర్నుంచి దిల్ రాజుతో ఓ సినిమా చేద్దామని భావించానని, కానీ ఇప్పటికి కుదిరిందని, త్వరలో దిల్ రాజుతో ఓ సినిమా చేస్తున్నానని నాని ప్రకటించాడు. ఈ సినిమాలో పని చేసిన వారందరికీ అభినందనలని అన్నాడు. సాయిధరమ్ తేజ్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్'ను ఈ మధ్యే టీవీలో చూశానని, అప్పుడు వైట్ డ్రెస్ లో అచ్చం చిరంజీవిలా కనిపించాడని అన్నాడు. చిరంజీవిగారిలా కనిపించడం కాదు, ఆయనంత ఎత్తుకు ఎదగాలని నాని ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న వరుణ్ తేజ్ ను ఉద్దేశించి...బ్లాక్ మ్యాచింగ్ డ్రెస్ లు వేసుకొచ్చిన తామిద్దరం బౌన్సర్లలా ఉన్నామని చెప్పాడు. అయితే వరుణ్ సరిగ్గా బౌన్సర్ లా ఉంటే...తాను మాత్రం వీక్ బౌన్సర్ లా ఉన్నానని అన్నాడు. ఈ ఆడియో వేడుకలో రెండు సార్లు విజిల్ వేయాలని అనిపించిందని చెప్పాడు. మొదటిది 'అందం హిందోళం' పాట వచ్చినప్పుడైతే...రెండో విజిల్ రాశీ ఖన్నా నడుం చూపించినప్పుడని చెప్పాడు. దీంతో రాశీ గట్టిగా నవ్వేసింది.

  • Loading...

More Telugu News