: యూఎస్ వీసా ఫీజుల పెంపుపై అరుణ్ జైట్లీ ఆగ్రహం


యూఎస్ హెచ్ 1బీ, ఎల్1 వీసా ఫీజులను పెంచడంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెంపు వివక్షపూరితమని, భారతీయ ఐటీ కంపెనీలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. కాగా, ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న అరుణ్ జైట్లీ ఈరోజు ఆ దేశ వాణిజ్య ప్రాతినిధ్య రాయబారి మైఖేల్ ప్రోమన్ తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం యూఎస్ వీసా ఫీజుల పెంపు అంశాన్ని ఆయన ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News