: పోర్టుల అభివృద్ధిలో మహారాష్ట్రతో పోటీ పడుతున్నాం: సీఎం చంద్రబాబు


పోర్టుల అభివృద్ధి విషయంలో మహారాష్ట్రతో పోటీ పడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముంబయిలో ‘మారిటైమ్’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సముద్ర జల రవాణా ద్వారా కేవలం 1.9 శాతం ఎగుమతులు మాత్రమే చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉందన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటవుతోందని, కృష్ణపట్నం మీదుగా బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్ వస్తోందని అన్నారు. జల రవాణా అభివృద్ధిపై తన ఆలోచనలను ప్రతినిధులకు వివరించానని, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీతో ఒక ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పారు. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు బకింగ్ హామ్ కెనాల్ అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News