: 24 మంది భారత జాలర్లను పట్టుకున్న పాకిస్థాన్
గుజరాత్ తీరంలో 24 మంది భారతీయ జాలర్లను పాకిస్థాన్ నేవీ పట్టుకుంది. పోరుబందర్, ఓఖా ప్రాంతాలకు చెందిన ఈ 24 మంది జాలర్లు తమ జలాల్లోకి ప్రవేశించారన్న ఆరోపణలపై పట్టుకున్న పాకిస్థాన్ నేవీ సిబ్బంది వారి నుంచి నాలుగు పడవలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని కరాచీ తరలించినట్టు జాతీయ జాలర్ల ఫోరమ్ సెక్రటరీ మనీశ్ తెలిపారు. దీంతో గడచిన మూడు నెలల్లో 191 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాక్ నేవీ 34 పడవలను స్వాధీనం చేసుకుందని ఆయన చెప్పారు. ఈ మధ్యే పాక్ జైళ్లలో మగ్గుతున్న 172 మంది జాలర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.