: యాప్రాల్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ...సీసీ టీవీ నుంచి పుటేజ్ తీసిన పోలీసులు
హైదరాబాదులోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ లో దారుణం చోటుచేసుకుంది. యాప్రాల్ లో శాస్త్రి, బాల్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో శాస్త్రిని బాల్ రెడ్డి, అతని అనుచరులు కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ తతంగం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీనిని స్వాధీనం చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటనలో ప్రధాన నిందితుడు బాల్ రెడ్డి పరారీలో ఉన్నాడు. తనను హత్య చేసేందుకు బాల్ రెడ్డి కుట్రపన్నాడని, తనకు ఏదైనా జరిగితే దానికి కారణం బాల్ రెడ్డేనని శాస్త్రి పేర్కొన్నాడు. ఈ ఘటనకు పాతకక్షలే కారణమని పోలీసులు చెబుతున్నారు.