: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల దృష్ట్యా 100 సీసీ కెమెరాలతో నిఘా, కట్టుదిట్టమైన భద్రత : సీవీ ఆనంద్
ఐపీఎల్ మ్యాచ్‌ల దృష్ట్యా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచనున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్‌ల దృష్ట్యా 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 16 నుంచి మే 12 మధ్య జరిగే మొత్తం ఏడు మ్యాచ్‌ల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టేడియంలో విక్రయించే ఆహార పదార్థాల అధిక ధరలను నియంత్రిస్తామని చెప్పారు. స్టేడియంలోకి అనుమతించే ముందు సెల్‌ఫోన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు.