: అక్కడ ఒక టోకన్‌కు ఒక బిందె నీళ్లు మాత్రమే.. నిబంధనలు ఉల్లంఘిస్తే పనిష్మెంట్!
మహారాష్ట్రలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి బీడ్ గ్రామంలో ఉన్న ఓ దిగుడుబావి నుంచి స్థానికులు నీళ్లు తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. బావినుంచి నీళ్లు తోడుకునే ప్రయత్నంలో గ్రామస్థులు నానా తిప్పులు పడుతున్నారు. అధికంగా నీళ్లు తీసుకునే ప్రయత్నంలో ఆ దిగుడుబావిలో రాళ్లు, దుమ్ము పడుతోంది. అయితే ఈ పరిస్థితిని నివారించేందుకు గ్రామస్థులు బావి దగ్గర టోకన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఆ దిగుడు బావి నుంచి ఒక టోకెన్‌కు ఒకే బింద నీళ్లు తీసుకునే నిబంధన విధించారు. దీన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరో వైపు అక్కడి లాతూర్ ప్రాంతంలో రైలుతో మంచి నీళ్లు అందిస్తుండడంతో నీటి ఎద్దడి కష్టాలు కాస్త తగ్గాయి. బీడ్ గ్రామం ఉన్న మరాట్వాడ ప్రాంతంలో ఆ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు నీళ్ల కోసం నానా కష్టాలు పడుతున్నారు.