: ఏనుగుతో సెల్ఫీ దిగాలనుకున్నాడు.. తొండంతో కొట్టించుకొని ఆసుపత్రిలో పడ్డాడు!
సెల్ఫీ మోజులో పడి పలు సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నా ఆ పిచ్చి మాత్రం యువతను వదలట్లేదు. ప్రమాదకర ప్రాంతాలలో, క్రూర జంతువులతో సెల్ఫీలు దిగుతూ ఆపదను కొనితెచ్చుకుంటూనే ఉన్నారు. తాజాగా కేరళలో ఇటువంటి ఘటనే మరొకటి జరిగింది. ఏకంగా ఏనుగుతోనే సెల్ఫీ దిగుదామనుకున్న శ్రీలాల్ అనే వ్యక్తి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేరళలోని కిలిమనూర్‌లో ఓ ఆలయంలో సెల్ఫీ దిగే ప్రయత్నంలో మెల్లిగా ఒక అరటి పండును చేతపట్టుకొని తన దగ్గరకు వచ్చిన శ్రీశాల్‌ని ఏనుగు తొండంతో కిందపడేసి, కొట్టేసింది. దీంతో శ్రీశాల్ కేకలు వేశాడు. దీంతో అక్కడి వారు గాయాలతో ఉన్న అతడ్ని రక్షించి, ఆసుపత్రిలో చేర్చారు.