: రష్యా దూకుడు.. అమెరికా యుద్ధ‌నౌక‌పై సంచ‌రించిన ర‌ష్యా యుద్ధ‌ విమానాలు


ర‌ష్యా దూకుడుని ప్ర‌ద‌ర్శించింది. త‌మ‌ యుద్ధ విమానాల‌తో అమెరికా యుద్ధ‌నౌక‌ను వెంబ‌డించి, అధికారుల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. రష్యాకు చెందిన ప‌లు యుద్ధ‌ విమానాలు కొన్ని రోజుల క్రితం అమెరికా యుద్ధ‌నౌక అయిన‌ గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ యూఎస్‌ఎస్‌ డోనాల్డ్‌ కుక్‌పై నుంచి సంచరించాయి, తాజాగా మ‌రోసారి ఈ దుస్సాహ‌సానికి ఒడిగట్టాయి. బాల్టిక్ సముద్రంలో ఈ యుద్ధ నౌక‌కు చాలా స‌మీపంగా అవి సంచ‌రించాయి. ఈ విష‌యాన్ని తెలుపుతూ అమెరికా కొన్ని ఫుటేజీలను విడుదల చేసింది. ఇటువంటి దుస్సాహ‌సం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తుంద‌ని అమెరికా యూరోపియన్‌ మిలటరీ కమాండ్ పేర్కొంది.

  • Loading...

More Telugu News