: తీవ్ర జ్వరంతో షూటింగ్‌లో పాల్గొన్న న‌టి.. డ్యాన్స్‌ చేస్తూ కళ్లు తిరిగి పడిపోయిన నర్గిస్‌ ఫక్రి


అస‌లే తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతోన్న బాలీవుడ్ తార‌ నర్గిస్‌ ఫక్రి ముంబైలో ‘అజహర్‌’ సినిమాలో ఓ పాట చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంది. దీనిలో భాగంగా డ్యాన్స్‌ చేస్తూ బ‌ల‌హీన‌త‌తో క‌ళ్లుతిరిగి ప‌డిపోయింది. దీంతో నిర్మాతల‌కు ల‌క్ష‌ల రూపాయ‌ల న‌ష్టం వాటిల్లింది. అనారోగ్యం నుంచి కోలుకోగానే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటాన‌ని అనంత‌రం న‌ర్గిస్ తెలిపింది. ‘అజ‌హ‌ర్’ చిత్రం భార‌త క్రికెట్ మాజీ కెప్టెన్ అజ‌హ‌రుద్దీన్ రియ‌ల్ లైఫ్ ఆధారంగా తెర‌కెక్కుతోంది. టైటిల్ రోల్‌లో ఇమ్రాన్ హ‌ష్మీ న‌టిస్తుండ‌గా ఆయ‌న సెకండ్ వైఫ్‌గా న‌ర్గీస్ ఫ‌క్రి న‌టిస్తోంది. మే 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ‘అజ‌హ‌ర్’ సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే సినిమా షూటింగ్‌ని పూర్తి చేసిన‌ చిత్ర బృందం అదనంగా మరో పాటను చిత్రీక‌రిస్తూ ఉండ‌గా నర్గిస్‌ ఫక్రి క‌ళ్లుతిరిగి ప‌డిపోయింది.

  • Loading...

More Telugu News