: ముంబైలో బౌద్ధం స్వీక‌రించిన‌ రోహిత్ తల్లి, సోదరుడు


హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ స్కాలర్, దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక, అతని సోదరుడు రాజా ఈరోజు బౌద్ధ మ‌తాన్ని స్వీక‌రించారు. హెచ్‌సీయూలో కొన్ని నెల‌ల క్రితం సస్పెన్షన్‌కు గురైన విద్యార్థి రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. రోహిత్ దళితుడు కావడం వల్లే వివక్షకు గుర‌య్యాడంటూ.. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా రోహిత్ తల్లి, అతని సోదరుడు ముంబైలో ఈ రోజు బౌద్ధ మతంలోకి మారారు. అనంత‌రం రోహిత్‌ సోదరుడు రాజా మాట్లాడుతూ.. వివ‌క్ష‌కు తావులేని బౌద్ధమతాన్ని తాము స్వీక‌రించామ‌న్నాడు. అంబేద్క‌ర్ కూడా ఈ ఉద్దేశంతోనే త‌న జీవిత చివ‌రి కాలంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారని అన్నాడు.

  • Loading...

More Telugu News