: దళితులకు గౌరవం ఇదేనా? అంటూ తీవ్ర మనస్తాపం చెందిన ఏపీ మంత్రి పీతల సుజాత
వాడవాడలా అంబేద్కర్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్న వేళ, దళిత మంత్రి పీతల సుజాత తీవ్రంగా మనస్తాపం చెందారు. ఈ ఉదయం విజయవాడలో అంబేద్కర్ వేడుకలు జరుగుతున్న వేళ, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. అక్కడికి వచ్చిన తరువాత, వేదికపై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో తన ఫోటో లేకపోవడాన్ని ఆమె అవమానంగా భావించారు. తాను కార్యక్రమానికి వస్తున్నానని తెలిసి కూడా తన చిత్రాన్ని పెట్టలేదని, దళితులకు ఇదేనా గౌరవం? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బూబూ జగ్జీవన్ రాం వేడుకల్లోనూ ఆమె ఇదే విధమైన అవమానాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.