: రాజమండ్రిలో బ్లేడ్‌లతో దాడి చేస్తూ వీరంగం సృష్టించిన గ్యాంగ్
బ్లేడ్‌లతో దాడి చేస్తూ కొందరు దుండగులు ప్రయాణికుల నుంచి డబ్బు, నగదు దోచుకున్న ఘటన రాజమండ్రిలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. బ్లేడ్‌లను చేతపట్టుకున్న ఓ గ్యాంగ్ అక్కడి దివాన్ చెరువు సమీపంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిపై దాడి చేశారు. బ్లేడ్‌లతో గాయపరుస్తూ ప్రయాణికుల వద్ద ఉన్న డబ్బు, నగదు లాక్కున్నారు. అనంతరం పరారయ్యారు. ఘటనలో గాయపడిన ప్రయాణికులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్లేడ్ గ్యాంగ్ దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.